గ్యాంగ్‌లీడర్ టైటిల్ మాదే

Sun,March 10, 2019 11:51 PM

మూడు నెలల క్రితం గ్యాంగ్‌లీడర్ టైటిల్‌ను మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఈ టైటిల్ తమకు కావాలని మైత్రీ మూవీ మేకర్స్ వారు మమ్మల్ని సంప్రదించారు. మెగా హీరోలకు తప్ప ఇతరులకు ఈ టైటిల్ ఇవ్వనని వారితో చెప్పాను. మా అనుమతి లేకుండా ఛాంబర్ నియమనిబంధనలకు విరుద్దంగా తమ సినిమాకు గ్యాంగ్‌లీడర్ టైటిల్‌ను ప్రకటించారు అని అన్నారు మోహనకృష్ణ. మాణిక్యం మూవీస్ పతాకంపై గ్యాంగ్‌లీడర్ పేరుతో ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. నాని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూపొందిస్తున్న సినిమాకు ఇదే టైటిల్‌ను నిర్ణయించారు. అయితే ఈ టైటిల్‌పై న్యాయపరంగా హక్కులనీ తమకే ఉన్నాయని తెలిపారు మోహనకృష్ణ. ఇటీవల హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ నేనే హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో ఈ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాను. చిరంజీవిపై అభిమానంతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నాం. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్‌ను మైత్రీ మూవీ మేకర్స్ తమ సినిమాకు నిర్ణయించింది. దీనిపై ఛాంబర్‌లో ఫిర్యాదుచేశాం. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపీ, తెలంగాణ ఛాంబర్స్ మాకు అనుకూలంగా ఉన్నాయి అని తెలిపారు.

2221

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles