గీతా వినోదం


Sun,April 14, 2019 11:27 PM

ganesh rashmika mandanna lead chamak movie releases in telugu titled geetha chalo

ఛలో గీత గోవిందం చిత్రాలతో యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఆమె కథానాయికగా నటించిన కన్నడ చిత్రం ఛమక్ తెలుగులో గీతా..ఛలో పేరుతో అనువాదమవుతున్నది. గణేష్ కథానాయకుడు. సుని దర్శకుడు. ఈ నెల 26న ప్రేక్షకులముందుకురానుంది. మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కన్నడంలో ప్రేక్షకాదరణ పొందిన చిత్రమిది. వీకెండ్ పార్టీలు యువతరానికి మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే ఆసక్తికరమైన అంశం చుట్టు అల్లుకున్న కథ ఇది. రష్మిక నటన ప్రధానాకర్షణగా ఉంటుంది. వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది అన్నారు. ఏప్రిల్ 17న ఆడియో విడుదల చేయబోతున్నామని, 21న విశాఖపట్నంలోని కళాభారతిలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తామని సమర్పకుడు దివాకర్ తెలిపారు.

1152

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles