జీవితమే ఆట


Thu,June 6, 2019 12:43 AM

game over releasing in 1200 screens worldwide in telugu tamil and hindi on june 14

భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు రాని సరికొత్త కథాంశమిది అని చెప్పింది తాప్సీ. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గేమ్ ఓవర్. ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకుడు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ యానివర్సరీ రియాక్షన్ అనే మానసిక సమస్యతో బాధపడే ఓ యువతి కథ ఇది. జీవితమనే ఆటలో ఆమె ఎదుర్కొన్న మలుపులేమిటన్నది ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో 1200 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. హిందీలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాప్సీ నటన, పాత్ర చిత్రణ హైలైట్‌గా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది అని తెలిపారు. రొటీన్‌కు భిన్నమైన థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు.

1957

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles