గాలిపురం జంక్షన్‌లో..


Fri,March 15, 2019 11:15 PM

galipuram junction movie trailer launch

అభిషేక్, బాలాజీ, మధుశ్రీ, కవిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గాలిపురం జంక్షన్. చరణ్ బాలాజీ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది. చక్కని భావోద్వేగాలతో పాటు రైతు సమస్యల్ని ప్రస్తావించిన తీరు బాగుంది. సెంటిమెంట్, ఎమోషన్ సమపాళ్లలో కుదిరిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. గాలిపురం జంక్షన్‌లో ఏం జరిగింది?. ప్రేమ పెళ్లిళ్లు చేయాలనుకున్న ఓ యువకుడి జీవితం ఓ పాప కారణంగా ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ తరువాత అతను ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు? ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో అభిషేక్, మధుశ్రీ, సురేష్ కొండేటి, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

613

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles