మర్డర్ మిస్టరీతో

Tue,March 12, 2019 12:08 AM

జి.కొండలరావు ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం డిసెంబర్ 31. జి.లక్ష్మణరావు నిర్మాత. పోసాని కృష్ణమురళి, షకలక శంకర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. బోలే సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. డిసెంబర్ 31న వైజాగ్‌లో జరిగే హత్యల వెనకున్న రహస్యాన్ని ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి ఎలా ఛేదించాడన్నది ఆకట్టుకుంటుంది. ఏసీపీ రవీందర్‌గా నా పాత్ర వినూత్నంగా ఉంటుంది. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రమిదని, బోలే నేపథ్య సంగీతం, బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.ఆర్. వెంకటేష్, ఎడిటింగ్: కె.ఆర్ స్వామి.

780

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles