ప్రేమ అంత ఈజీ కాదు..


Tue,October 16, 2018 02:04 AM

First song in Prema Antha Easy Kaadu released

రాజేష్‌కుమార్, ప్రజ్వల్‌పూవియా జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమ అంత ఈజీ కాదు. ఈశ్వర్ దర్శకుడు. టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వినూత్నమైన ప్రేమకథా చిత్రమిది. ఓ జంట ప్రేమపయనంలో ఎదురయ్యే సంఘటనలు ఆసక్తిని పంచుతాయి. వినోదంతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని, నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ నెలలో సినిమాను విడుదలచేస్తాం అని తెలిపారు. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిదని నిర్మాతలు చెప్పారు. ఇందులో తాను ఏ.ఆర్.రెహమాన్ వీరాభిమానిగా కనిపిస్తానని రాజేష్‌కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ధన్‌రాజ్, కేదార్‌శంకర్ పాల్గొన్నారు.

3570

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles