అదేంటోగాని ఉన్నపాటుగా..

Mon,February 11, 2019 11:37 PM

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి (మళ్లీరావా ఫేమ్) దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమాలోని తొలి గీతాన్ని ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఈ నెల 14న విడుదల చేయబోతున్నారు. అదెంటోగానీ ఉన్నపాటుగా అనే పల్లవితో సాగే ఈ గీతం సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్ అందరిని ఆకట్టుకున్నాయి. 36ఏళ్ల వయసులో అర్జున్ అనే వ్యక్తి క్రికెట్‌లో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన పరిస్థితులేమిటన్నది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సత్యరాజ్, రోనిత్‌కామ్రా, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సను వర్గీస్, ఆర్ట్: అనివాష్ కొల్లా, ఎడిటర్: నవీన్‌నూలి, సమర్పణ: పీడీవీ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గౌతమ్‌తిన్ననూరి.

1162

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles