సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎవరు’


Thu,July 11, 2019 11:27 PM

First look of Adivi Sesh and Regina Cassandras Evaru out

అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రెజీనా కథానాయిక. నవీన్‌చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ సినిమాలో అడివి శేష్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. పరిశోధనాత్మక థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’ అన్నారు. ఆగస్ట్‌ 23న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, సంభాషణలు: అబ్బూరి రవి, దర్శకత్వం: వెంకట్‌ రామ్‌జీ.

303

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles