ప్రతి అడుగు విలువైనదే!


Sat,July 6, 2019 11:56 PM

Films with good content andukovalanede everybody appreciated my dream Young producer eskeen

చిరంజీవి అభిమానిగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేశారు ఎస్‌కేఎన్. జర్నలిస్ట్‌గా, పంపిణీదారుడిగా, సహనిర్మాతగా మంచి అనుభవం గడించిన అనంతరం టాక్సీవాలా చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే అభిరుచిగల యువ నిర్మాతగా సత్తాచాటారు. నేడు ఎస్‌కేఎన్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ 18ఏళ్ల క్రితం ఆన్‌లైన్‌లో మెగాఫ్యాన్స్ క్లబ్ నడిపిస్తూ చిరంజీవి సినిమాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తుండేవాడిని. ఈ క్రమంలో నాకు అల్లు శిరీష్‌తో పరిచయం ఏర్పడింది. విజయవాడలో జరిగిన ఇంద్ర చిత్ర వేడుకలో శిరీష్ నన్ను అల్లు అర్జున్‌కు పరిచయం చేశారు. అలా మెగా కుటుంబానికి మరింత చేరువయ్యాను. ఆ తర్వాత మారుతి, బన్నీవాసు, యు.వి.క్రియేషన్స్ వంశీతో కలిసి సినిమాలు పంపిణీ చేశాను. ఆ అనుభవంతో ఈ రోజుల్లో చిత్రం ద్వారా సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను.

టాక్సీవాలా చిత్రాన్ని చూసిన చిరంజీవిగారు ఇంటికి ఆహ్వానించి రెండు గంటల పాటు అప్యాయంగా మాట్లాడారు. నా జీవితంలో మరచిపోలేని రోజది. సినిమాకు కేవలం పెట్టుబడే కాదు..మార్కెటింగ్, పబ్లిసిటీ కూడా చాలా ముఖ్యం. ప్రణాళికబద్దంగా సినిమాలు చేస్తేనే విజయం సాధిస్తాం. పరిశ్రమలో ప్రతి అడుగు విలువైనదే. ప్రతి సినిమాను డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించి పనిచేస్తాను. తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలియాలన్నదే నా అభిలాష. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న ప్రతిరోజు పండగే చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను. నవ్యమైన కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ బాధ్యతగా సినిమాలు తీయాలన్నదే నా లక్ష్యం. ఈ మధ్యే ఇద్దరు దర్శకులు కథలు చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఆ సినిమాల వివరాల్ని త్వరలో తెలియజేస్తాను అన్నారు.

290

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles