వలపు మైమరపులో ‘ఫిదా’


Mon,June 19, 2017 02:49 AM

fidha
నచ్చిన చెలియ ఓరచూపు చూసి కొంటెనవ్వు నవ్వితే ఎవరైనా సరే ఇట్టే ఫిదా అయిపోవాల్సిందే. తొలి వలపు మధుర భావనల్ని మాటల్లో వర్ణించలేము. అక్షరాల్లో బంధించలేము. స్వీయానుభవంలో తెలుసుకోవాల్సిందే. అలాంటి అందమైన ప్రేమికుల కలల ప్రపంచానికి దృశ్యరూపమే ఈ ఫిదా అంటున్నారు శేఖర్‌కమ్ముల. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. టాకీపార్ట్ పూర్తయింది. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శనివారం చిత్రటీజర్‌ను విడుదల చేశారు. రైలులో వెళ్తూ ఎవరో వ్యక్తిని తిడుతున్న కథానాయిక సాయిపల్లవిని చూసి ఫిదా అయిపోయిన వరుణ్‌తేజ్ ఏం పిల్లరా..వెళ్లట్లేదు మైండ్‌లో నుంచి.

జీవితాంతం ఒకరితో ఉండాలనుకుంటున్నావు కదా...తను ఈమే అనే సంభాషణతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి శక్తికాంత్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

1933

More News

VIRAL NEWS