హైదరాబాద్ సంస్కృతిని చాటుతుంది


Tue,May 14, 2019 01:14 AM

Falaknuma Das is going to be a blockblaster Venkatesh

సహజత్వాన్ని ప్రతిబింబించే విభిన్నమైన సినిమా ఇది. యువతరాన్ని మెప్పిస్తుంది. హైదరాబాద్ నగర సిసలైన సంస్కృతిని ఈ సినిమాలో చూపించారు అని అన్నారు హీరో వెంకటేష్. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫలక్‌నుమా దాస్. కరాటే రాజు నిర్మిస్తున్నారు. సురేష్ బాబు విడుదలచేస్తున్నారు. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి చారులింగ కథానాయికలు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో వెంకటేష్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ టీజర్, ట్రైలర్ వినూత్నంగా ఉన్నాయి. యువత జీవితాల్లోని ఒడిదుడుకుల్ని ఆసక్తికరంగా చూపించారు అని తెలిపారు. విశ్వక్‌సేస్ మాట్లాడుతూ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి ఇండస్ట్రీలోని కొంతమందిని ఆహ్వానించాను. వారు ఎవరూ రాలేదు.

వెంకటేష్‌గారిని అడగ్గానే వచ్చారు. ఆయన ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమలో కొత్తవాళ్లను ఎదగనివ్వరని మాట్లాడుతుంటారు. అవన్నీ అవాస్తవాలే. నా తొలిసినిమాను దిల్‌రాజు ప్రేక్షకులకు అందిస్తే ఈ సినిమాను సురేష్‌బాబు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని రెండు రోజుల్లో వెల్లడిస్తాం అని తెలిపారు. నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని 118 లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించాం. హైదరాబాద్ సంస్కృతిని చాటిచెబుతుంది. హైదరాబాద్ యువకులు ఎలా ఉంటారో చూపిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి, మనోజ్ పాల్గొన్నారు.

778

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles