ఒక చరిత్ర చెప్పాలంటే..!


Fri,December 14, 2018 03:45 PM

F2 Movie Triler Relese

వారిద్దరు బ్రహ్మచారులు. వయసు కూడా కాస్త ముదురే. పుణ్యకాలం గడచిపోయేలోపే పెళ్లి చేసుకొని సెటిలైపోవాలనుకుంటారు. నచ్చిన సుందరాంగుల కోసం కోసం అన్వేషించడం ఆరంభిస్తారు. ఈ క్రమంలో వారికి గమ్మత్తైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ వినోదాల హంగామా ఏమిటో తెరపై చూడాల్సిందే అంటున్నారు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్-2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకురానుంది. బుధవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత అంటాం అని వెంకటేష్ చెప్పే సంభాషణతో మొదలైన టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.

ఇప్పుడు నీకు ఈ పెళ్లి అవసరమా వెంకీ..ఒక చరిత్ర చెప్పాలంటే తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత అంటూ వరుణ్‌తేజ్..వెంకీని టీజ్ చేయబోతే ఆ టాపిక్ ఇప్పుడెందుకు భయ్యా అని వెంకటేష్ టెన్షన్ పడటం, నేను నీలెక్కకాదు..పెళ్లాన్ని కంట్రోల్ చేసుడు నాకు మస్త్ తెలుసు అని వరుణ్‌తేజ్ తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్ చెప్పడం చక్కటి వినోదాన్ని పంచింది. విడుదలైన కొద్ది గంటల్లోనే టీజర్‌కు అత్యధిక వీక్షణలు లభించాయి. ఇటీవలకాలంలో కడుపుబ్బా నవ్వించిన టీజర్ ఇదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వెంకటేష్, వరుణ్‌తేజ్ మధ్య కామెడీ సన్నివేశాలు బాగా పండాయని మెచ్చుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

4213

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles