హృద్యమైన ప్రేమకథ


Sat,September 14, 2019 12:29 AM

Evvarikee Cheppoddu Releasing on October 8th

స్వీయ నిర్మాణంలో రాకేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. బసవ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గార్గేయి ఎల్లాప్రగడ కథానాయిక. అక్టోబర్‌ 8న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. హీరో, నిర్మాత రాకేష్‌ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమలోని మధురభావనలకు అద్దం పడుతుంది. వినోదానికి పెద్దపీట వేస్తూ రూపొందించాం. దిల్‌రాజుగారు మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మెచ్చే చిత్రమవుతుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌ జె ఆనంద్‌, సంగీతం: శంకర్‌శర్మ, ఆర్ట్‌: లక్ష్మిసింధూజ గ్రంధి, రచన-దర్శకత్వం: బసవ శంకర్‌.

213

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles