కొత్త కథలకు పట్టం


Sat,July 20, 2019 11:11 PM

Evaru Movie Teaser Launch by Samantha Akkineni Adivi Sesh, Naveen Chandra  Shalimarcinema

అడివి శేష్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం ఎవరు. వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. నవీన్‌చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం కథానాయిక సమంత విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ టీజర్ బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగు సినిమాకు మంచి టైమ్ నడుస్తున్నది. ప్రేక్షకులు కొత్త కథలకు పట్టం కడుతున్నారు. అదే కోవలో ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. థ్రిల్లర్ జోనర్ చిత్రమిది. నేనెప్పుడు మంచి సినిమాలో భాగం కావాలనుకుంటాను. ఆ నమ్మకంతోనే ఈ చిత్రంలో నటించాను. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అని అడివి శేష్ తెలిపారు. ఈ చిత్రంలో తాను గుర్తిండిపోయే పాత్రలో నటించానని నవీన్‌చంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ వంశీ, రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంభాషణలు: అబ్బూరి రవి.

347

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles