హీరోగా నన్ను ఎవరూ నమ్మలేదు!


Tue,August 13, 2019 11:45 PM

Evaru Movie Pre Release Event Adivi Sesh Regina Cassandra Naveen Chandra

అడివిశేష్, రెజీనా, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎవరు. వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ నెల 15న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. అడివి శేష్ మాట్లాడుతూ పరిశ్రమకు సంబంధం లేని 1000మందికి సినిమా చూపించాం. మాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ నుంచి సినిమాను బెటర్ చేస్తూ వచ్చాం. హీరోగా తొలుత నన్ను ఎవరూ నమ్మలేదు. క్షణం సినిమాతో పీవీపీ నమ్మారు. ఆ సినిమా నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. గూఢచారి తర్వాత వైవిధ్యతను నమ్మి ఈ సినిమా చేశాను. ఇందులో మాస్ పోలీస్‌గా నా పాత్ర సాగుతుంది అన్నారు.

ప్రస్తుతం తెలుగు సినిమా కొత్తపుంతలు తొక్కుతోంది. జెర్సీ, బ్రోచెవారెవరురా, ఏజెంట్ సాయి ఆత్రేయ..ఇలా మంచి సినిమాలొస్తున్నాయి. ఆ జాబితాలో ఎవరు చేరుతుందనే నమ్మకం ఉంది అన్నారు. రెజీనా మాట్లాడుతూ ఈ కథ నాకు బాగా నచ్చింది. నా పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దారు అని చెప్పింది. ఈ సినిమా విషయంలో అందరూ పాజిటివ్‌గా ఉన్నారని, తన పాత్ర సవాలుగా అనిపించిందని నవీన్‌చంద్ర తెలిపారు. కథానుగుణంగా మంచి సంగీతం కుదిరిందని శ్రీచరణ్ పాకాల చెప్పారు.

681

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles