ఇంజినీరింగ్ ్రప్రేమాయణం


Fri,March 22, 2019 12:03 AM

eureka official motion poster released

కార్తిక్ ఆనంద్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం యురేక. లక్ష్మిప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మిస్తున్నారు. షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా గురువారం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. దర్శకుడు మాట్లాడుతూ ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రమిది. ఉత్కంఠభరితమైన మలుపులతో ప్రతి క్షణం థ్రిల్‌ను కలిగిస్తుంది. తమకు ఎదురైన ఓ విపత్కర పరిస్థితి నుంచి కొందరు విద్యార్థులు ఎలా బయటపడ్డారన్నదే చిత్ర ఇతివృత్తం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కథను నమ్మి రూపొందిస్తున్న ఈ చిత్రం సరికొత్త అనుభూతిని పంచుతుంది. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం అని తెలిపారు. రఘుబాబు, శివన్నారాయణ, బ్రహ్మాజీ, అభయ్, రాకెట్ రాఘవ కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, ఛాయాగ్రహణం: ఎన్.బి. విశ్వకాంత్.

1087

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles