మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో.


Thu,June 6, 2019 11:00 PM

Erra Cheera Movie Firstlook Launch

కారుణ్య చౌదరి, మహానటి ఫేమ్ సాయి తేజస్విని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎర్రచీర. చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఫస్ట్‌లుక్‌లో హారర్ కోణం కనిపిస్తోంది. సాయి తేజస్విని అద్భుతంగా నటించింది. ఈ సినిమా విజయం సాధించి టీమ్ అందరికి మంచి పేరు రావాలి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూసి హారర్ థ్రిల్లర్ అనుకుంటున్నారు. కానీ ఇది ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ వున్న సినిమా. దీనికి హారర్ అంశాల్ని జతచేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో బేబీ సాయితేజస్విని, కమల్ కామరాజు తదితరులు పాల్గొన్నారు.

1292

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles