థ్రిల్లర్ యురేక


Thu,June 13, 2019 12:58 AM

engaging thriller eureka in post production works

కార్తిక్ ఆనంద్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం యురేక. షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ప్రశాంత్ తాతా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్తిక్ ఆనంద్ మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నమైన థ్రిల్లర్ చిత్రమిది. తెలుగు తెరపై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. విపత్కర పరిస్థితుల నుంచి ఓ ప్రేమజంట ఎలా బయటపడిందన్నది ఉత్కంఠను పంచుతుంది. ఇటీవల విడుదలచేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. త్వరలో ఆడియో, సినిమా విడుదల తేదీని వెల్లడిస్తాం అని చెప్పారు. అపూర్వ, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, సినిమాటోగ్రఫీ: ఎన్.బి. విశ్వకాంత్.

325

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles