టెర్రరిజమ్ నేపథ్యంలో..


Tue,June 11, 2019 11:40 PM

Ek Movie released on june 14th

బిట్టు, అపర్ణశర్మ, హిమాన్షి ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఏక్. సత్ రుద్రారపు దర్శకత్వం వహిస్తున్నారు. కె వరల్డ్ మూవీస్ పతాకంపై హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్‌లో దర్శకుడు అజయ్ భూపతి ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ టెర్రరిజమ్ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన అమరవీరులకు అంకితం చేస్తున్నాం. మంత్ర ఆనంద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ వున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సుమన్, బెనర్జీ, పృథ్వీ, శ్రవణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చక్రవర్తి, రచయిత, నిర్మాత: హరి.

427

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles