ఇందు గోపి ప్రేమాయణం!


Wed,December 13, 2017 11:11 PM

Ego Movie Trailer Launch

Ego
ఆశిష్‌రాజ్, సిమ్రాన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఇగో(ఇందు గోపీ). ఆర్.వి.సుబ్రహ్మణ్యం దర్శకుడు. వి.కె.ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మారుతి బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ టీజర్ చూసిన తరువాత సినిమా ఖచ్చితంగా బాగుంటుందనే భావన కలిగింది. ఆశిష్‌రాజ్ తెలుగు రాకపోయినా అమలాపురం యువకుడిగా అద్భుతంగా నటించాడు. రాజీపడకుండా నిర్మాతలు ఖర్చు పెట్టారు. టీమ్ అంతా కష్టపడి పనిచేశారు అన్నారు. ఆశిష్‌రాజ్ మాట్లాడుతూ ఇందు, గోపీల ప్రేమకథ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో నా పాత్ర చిత్రణ చాలా కొత్తగా వుంటుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాతల నమ్మకానికి మించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాననే సంతృప్తితో వున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో సిమ్రన్, విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్, సుభాష్, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

752

More News

VIRAL NEWS

Featured Articles