ఈ మాయ పేరు ప్రేమ


Tue,June 12, 2018 11:23 PM

Ee Maya Peremito movie Teaser unveiled by naga Chaitanya

rahul
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సులభం కాదు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తూనే మనలో దాగివున్న ప్రతిభను ఉపయోగించుకున్నప్పుడే సక్సెస్ అవుతాం. రాహుల్‌లో ఆ ప్రతిభ ఉంది. హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడనే నమ్మకముంది అని అన్నారు కథానాయకుడు నాగచైతన్య. సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ఈ మాయ పేరేమిటో. వి.ఎస్. క్రియేటివ్ వర్స్స్ పతాకంపై దివ్య విజయ్ నిర్మిస్తున్నారు. రాము కొప్పల దర్శకుడు. కావ్య థాపర్ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నాగచైతన్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రారండోయ్ వేడుక చూద్దాం చిత్రీకరణ సమయంలో రాహుల్‌ను చూశాను. అతడిలో అందం, ప్రతిభ ఉన్నాయి. హీరోగా అతడు రాణించాలి అని తెలిపారు.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉండి కూడా తమ సినిమా కోసం నాగచైతన్య ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉందని దివ్యవిజయ్ తెలిపారు. 100 పర్సెంట్ లవ్ చిత్రానికి తాను సహాయకుడిగా పనిచేశానని, తన గురువు సుకుమార్‌తో పాటు విజయ్ మాస్టర్‌కు తనపై ఉన్న నమ్మకం వల్లే దర్శకుడిని కాగలిగానని రాము చెప్పారు. హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ భిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు కలిగిన ఓ జంట కథ ఇది. కథలోని భావోద్వేగాలతో ప్రతి ఒక్కరూ సహానుభూతి చెందుతారు. సినిమా పూర్తయినా జ్ఞాపకాలు చాలా కాలం వెంటాడుతాయి. వైజాగ్ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ మాస్టర్, కావ్యథాపర్ పాల్గొన్నారు.

2180

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles