నాన్న కల నిజమైంది!


Thu,September 20, 2018 11:34 PM

Ee Maya Peremito Movie Hero Rahul Vijay Interview

నటుడిగా ఒక జోనర్‌కు పరిమితం కావాలని లేదు. అన్ని రకాల చిత్రాల్లోనూ నటించాలని వుంది. ప్రతీ ఒక్కరూ మన అబ్బాయిలా వున్నాడే అనుకోవాలి. అన్నారు రాహుల్ విజయ్. ఈ మాయ పేరేమిటో చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ యువకుడు సీనియర్ ఫైట్‌మాస్టర్ విజయ్ తనయుడు. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్య విజయ్ నిర్మించిన ఈ మాయ పేరేమిటో చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాహుల్ విజయ్ ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. అలాంటి యువకుడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తరువాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? చివరికి చందు కథ ఎలా సుఖాంతమైంది అన్నది తెరపైన చూడాల్సిందే. నా వయసుకు తగ్గ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో కథను నమ్మి సినిమా చేశాం.

నాన్న ఫైట్ మాస్టర్ కావడం వల్ల చిన్నతనం నుంచి సినిమా వాతావరణం అలవాటైంది. నన్ను హీరోగా చూడాలన్నది ఆయన కల. స్కూల్ డేస్‌లో.. సినిమా థీయేటర్‌లలో నేను డ్యాన్స్ చేయడం గమనించిన నాన్న నన్ను ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ లారెన్స్ దగ్గర చేర్పించారు. ఎనిమిదేళ్ల పాటు వివిధ డ్యాన్సుల్లో శిక్షణ తీసుకున్నాను. ఆరేళ్ల పాటు జమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందిన తరువాత బ్యాంకాక్‌లోనూ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల, వైజాగ్ సత్యానంద్‌ల వద్ద నటనలో మెలకువలు నేర్చుకున్నాను.తొలి ప్రయత్నంగా మంచి కథ ఎవరు చెబితే వారితోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసోసియేట్ రాము కొప్పుల చెప్పిన కథ బాగా నచ్చింది. కథపై నమ్మకంతో సినిమా చేశాను. తెరపై తొలిసారి చూసుకోగానే ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించినట్లు అనిపించింది. సినిమా ఫలితం ఎలా వుంటుందనేది పక్కన పెడితే ఈ సినిమాతో హీరోగా నువ్వు పాసయ్యావ్ అని నాన్న అనడం ఆనందంగా అనిపించింది. నా నా రెండో సినిమా రూపొందుతున్న చిత్రంలో నిహారికతో కలిసి నటిస్తున్నాను. రోమ్ కోమ్ జోనర్‌లో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది అని తెలిపారు.

1293

More News

VIRAL NEWS