ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు ..


Fri,August 9, 2019 11:44 PM

Edaina Jaragochu Release on August 23rd

నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏదైనా జరగొచ్చు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కె.రమాకాంత్ దర్శకుడు. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా వుంటుంది. క్షణ క్షణం ఉత్కంఠను పంచుతుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్‌కు చక్కటి స్పందన వచ్చింది. చిత్రాన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వుంది అని తెలిపారు. పూజా సోలంకి, శశిసింగ్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవి, శివతేజ, వైవా రాఘవ, నాగబాబు, వెన్నెల కిషోర్, అజయ్‌ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల, సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు: వికర్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ ప్రకాష్ అన్నామ్రెద్ది, సహ నిర్మాత: సుదర్శన్ హనగోడు.

317

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles