ఏదైనా జరగొచ్చు గీతాలు


Mon,May 6, 2019 11:04 PM

edaina jaragocchu movie audio launch

పరుచూరి బ్రదర్స్, ఎస్వీకృష్ణారెడ్డి, కల్యాణ్, శ్రీకాంత్‌తో పాటు ఇండస్ట్రీలోని అందరి సహాయసహకారాల వల్లే నాలుగు వందల యాభై సినిమాలు చేయగలిగాను. కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలుస్తున్నారు. అందరి స్నేహం, ప్రేమాభిమానాల వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. అదే ప్రేమను మా అబ్బాయిపై చూపించాలని కోరుకుంటున్నాను అని అన్నారు నటుడు శివాజీరాజా. ఆయన తనయుడు విజయ్‌రాజా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ఏదైనా జరగొచ్చు. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధర్మ్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కె.రమాకాంత్ దర్శకుడు. పూజ సోలంకి, సాషా సింగ్ కథానాయికలు. శ్రీకాంత్ పెండ్యాల స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

ట్రైలర్‌ను హీరోలు శ్రీకాంత్, తరుణ్ విడుదలచేశారు. మూర్ఖత్వానికి సరిహద్దులు లేవనే క్యాప్షన్‌తో సినిమాను సరదాగా తెరకెక్కించారని, విజయ్‌ని చూస్తుంటే బొబ్బిలిరాజా రోజుల్లో శివాజీరాజాను చూస్తున్నట్లుందని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు నవ్యమైన అనుభూతిని పంచుతుంది అన్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరిస్తుంది అని విజయ్‌రాజా పేర్కొన్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ శ్రీకాంత్ స్వరపరచిన బాణీలు బాగున్నాయి. రమాకాంత్ విభిన్నమైన కథాంశంతో మంచి సినిమా తీశాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, తమ్మారెడ్డిభరద్వాజ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

1437

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles