కల్కి పరిశోధన


Mon,June 10, 2019 12:07 AM

Dr Rajasekhar Kalki gets a release on June 28

రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కల్కీ. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ వినూత్న కథా చిత్రమిది. టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. శ్రవణ్ భరద్వాజ్ చక్కటి బాణీలను అందించాడు. త్వరలో ఆడియో విడుదలతో పాటు ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తాం అన్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కల్కీ రహస్యం మేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తాం అని దర్శకుడు తెలిపారు. నవ్యత మేళవించిన మాస్ ఎంటర్‌టైనర్ ఇదని, ట్రైలర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉందని జీవిత రాజశేఖర్ చెప్పారు. ఆదాశర్మ, నందితాశ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్‌రాణా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్‌భరద్వాజ్, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్, దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.

652

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles