ఎమోషనల్ థ్రిల్లర్


Tue,August 20, 2019 12:30 AM

Dr Emotion with an emotional thriller storyline Rajasekhar new movie

డా॥రాజశేఖర్ కథానాయకుడిగా క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనున్నది. జి.ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ నవ్యమైన ఇతివృత్తంతో రూపొందుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. సింగిల్‌సిట్టింగ్‌లోనే రాజశేఖర్ కథ విని ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. టైటిల్‌ను నిర్ణయించి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. సింగిల్ షెడ్యూల్‌లోనే చిత్రీకరణ పూర్తిచేసి 2020లో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలను పోషించనున్నారు. కథానాయికతో పాటు మిగతా సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం. తమిళంలో యూటర్న్, కొలైకారన్, మిస్టర్ చంద్రమౌళి సినిమాల్ని నిర్మించిన నేను ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యస్.పి.శివప్రసాద్, సంగీతం: సైమన్ కె కింగ్.

226

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles