దోస్తానా సీక్వెల్‌లో..


Mon,July 8, 2019 12:05 AM

Dostana 2 Kartik Aaryan And Janhvi Kapoor Are New Brother Sister in Bollywood

జాన్ అబ్రహం, అభిషేక్‌బచ్చన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దోస్తానా. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి దాదాపు పదేళ్ల విరామం తరువాత సీక్వెల్‌ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్ ధర్మాప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబోతున్నారు. కార్తిక్ ఆర్యన్, జాన్వీకపూర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. కోలిన్ డీ కన్హా దర్శకుడిగా పరిచయం కానున్నారు. జాన్వీని కథానాయికగా పరిచయం చేస్తూ కరణ్‌జోహార్ సైరట్ రీమేక్‌ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజా చిత్రంలో జాన్వీకపూర్ పాత్ర చిత్రణ ఛాలెంజింగ్‌గా సాగుతుందని, ఇందులో కార్తిక్ ఆర్యన్, జాన్వీ అన్నా చెల్లెళ్లుగా కనిపించనున్నారని తెలిసింది. కరణ్‌జోహార్ మాట్లాడుతూ దోస్తానా సీక్వెల్ కోసం చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. కార్తిక్ ఆర్యన్, జాన్వీకపూర్‌తో మళ్లీ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయాలనుకుంటున్నాను. మరో కీలక పాత్ర కోసం ప్రతిభావంతుడైన కొత్త నటుడిని వెతుకుతున్నాను అని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం వెల్లడించనుంది.

1152

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles