మా పరువు బజారు పాలు చేయొద్దు!


Sat,March 9, 2019 02:06 AM

do not get maa dignity to market shivaji raja

నరేష్, రాజశేఖర్, జీవిత..వీళ్లంతా మీడియా ముందుకెళ్లి మా గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. అవి విని ఊరుకుంటే మేమేదో తప్పు చేశామని ప్రజలు అనుకుంటారు. అందుకే మేం కూడా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఈ మధ్య రకరకాల మాటలు వినాల్సి వస్తోంది. మేం ఎప్పుడూ తప్పు చేయలేదు. ఈ సారి కూడా మీరే వుండండి అని మా కార్యవర్గ సభ్యులంతా అడిగారు. అందుకే ఇష్టం లేకపోయినా పోటీచేస్తున్నా అని అన్నారు శివాజీరాజా. ఈ నెల 10న జరగనున్న మా ఎన్నికల్లో శివాజీరాజా మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన ప్యానల్ సభ్యులతో గురువారం రాత్రి హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. శివాజీరాజా మాట్లాడుతూ మా నిధుల కోసం చిరంజీవిగారితో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.

రిహార్సల్స్ కోసం నరేష్‌ని పిలిచాం. కానీ తను రాలేదు. మా సభ్యులెవరైనా పుట్టిన రోజు జరుపుకుంటే వాళ్ల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. నా పుట్టిన రోజున నిన్ను కలుస్తా ఛాంబర్‌కి రా అని చెప్పిన నరేష్ చాలా సేపు నన్ను ఛాంబర్ వద్దే తన గురించి ఎదురుచూసేలా చేశాడు. తీరా చూస్తే చూశావా.. నా కోసం శివాజీరాజాను ఎదురుచూసేలా చేశా అని ఎవరికో ఫోన్ చేసి చెప్పాడట. నాకు ఎవరినీ విమర్శించాలని లేదు. కానీ లేనిపోని మాటలు చెప్పి మా పరువు బజారు పాలు చేయొద్దు. రాజశేఖర్ జీవిత కూడా నిజాలు తెలుసుకుని మాట్లాడండి. యాభై మంది కళాకారులు అవకాశాలు లేక బాధపడుతుంటే ఓ అజ్ఞాత వ్యక్తి సహాయంతో ఏడాదికి ఆరు నెలల పాటు నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తున్నాం. పింఛను రూపంలో ఇస్తున్న రూ. 5 వేలని రూ. 7500 చేయాలని నిర్ణయించాం అన్నారు.

2993

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles