నా స్వీయ అనుభవాలున్నాయి


Wed,June 5, 2019 12:04 AM

Director Tn-Krishna Tells Meaning Of Hippi

14వ శతాబ్దంలో ఆంగ్ల కవి జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్‌డ్‌లలోని ఆడమ్, ఈవ్ పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం అభిరుచులకు తగినట్లుగా హిప్పీ సినిమాను రూపొందించాం అని అన్నారు టి.ఎన్.కృష్ణ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం హిప్పీ. కార్తికేయ, దిగాంగన సూర్యవన్షీ జంటగా నటిస్తున్నారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఈ నెల 6న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుడు టి.ఎన్. కృష్ణ పాత్రికేయులతో ముచ్చటించారు.

ఇదివరకు వెండితెరపై రాని సరికొత్త ప్రేమకథ ఇది. మనసు చెప్పినట్లుగా నడుచుకునే ఓ బాక్సర్ మహిళాబైకర్‌తో ఎలా ప్రేమలో పడ్డాడన్నది ఆకట్టుకుంటుంది. అనుబంధాలు, ఆప్యాయతల విషయంలో నవతరం అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? వారికి ఎదురయ్యే సమస్యలతో తెరకెక్కించాను. నిత్యజీవితంలో మనకు తారసిల్లే యువకుల్లా కార్తికేయ పాత్ర సాగుతుంది. జేడీ చక్రవర్తి అరిస్టాటిల్ లాంటి పాత్ర చేశారు. సానుకూల దృక్పథం కలిగి దేనికి అడ్డుచెప్పని మనస్తత్వంతో ఆయన పాత్ర ఆసక్తిని పంచుతుంది. నిజ జీవితంలో ప్రేమ అనుభవాలు లేనిదే లవ్‌స్టోరీస్ రాయలేమన్నది నా నమ్మకం. ఈ కథలో నా వ్యక్తిగత అనుభవాలు చాలా ఉన్నాయి.

అందుకే విరామమొచ్చింది..
ఆర్‌ఎక్స్ 100 చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసే అవకాశం రావడంతో సినిమా చూశాను. అందులో కార్తికేయ నటన నన్ను అమితంగా ఆకట్టుకున్నది. హిప్పీ సినిమాను అతడితో చేస్తే బాగుంటుందనిపించింది. కథ నచ్చి కార్తికేయ ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమాను రూపొందించాం. తమిళంలో వేరే హీరోతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిల్లును ఒరు కాదల్(తెలుగులో నువ్వు నేను ప్రేమ) తర్వాత నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. అందువల్లే విరామం వచ్చింది. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను. తెలుగులో దర్శకుడిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాను. సాంస్కృతిక పరివర్తన నేపథ్యంలో గ్లోబల్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నది. అలాగే కలైపులి థానుతో కలిసి మరో ద్విభాషా సినిమా చేయబోతున్నాను.

316
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles