కమ్మ రాజ్యంలో కడప రెడ్లు


Sun,May 26, 2019 11:28 PM

director ram gopal varma press meet on lakshmis ntr movie in vijayawada

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నానని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం విజయవాడ ఫిల్మ్ ఛాంబర్‌లో రామ్‌గోపాల్‌వర్మ పాత్రికేయులతో ముచ్చటించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తికి ప్రజాకోర్టులో శిక్షపడిందని, ఎన్నికల్లో సైకిల్ పంక్చర్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో రామ్‌గోపాల్‌వర్మ స్పందిస్తూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమా తీయబోతున్నాను. చిత్రీకరణ మొత్తం విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో జరుపుతాం. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంటారు అని వర్మ పేర్కొన్నారు.

2572

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles