శివరంజని రహస్యం


Wed,June 5, 2019 12:04 AM

director maruthi sivaranjani pop corn song launched

రష్మిగౌతమ్, నందు జంటగా నందినిరాయ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం శివరంజని. నాగప్రభాకరన్ దర్శకుడు. ఏ. పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నిర్మాతలు. ఈ సినిమాలోని పాప్ కార్న్.. అనే గీతాల్ని దర్శకుడు మారుతి మంగళవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ హారర్ నేపథ్య చిత్రాల్ని తక్కువ ఖర్చుతో తీస్తారు. కానీ ఈ సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తున్నది అన్నారు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా నడిచే కథ ఇది. రష్మి పాత్రలో భిన్నకోణాలు కనిపిస్తాయి. అనుహ్య మలుపులతో ఆద్యంతం ప్రేక్షకులకు థ్రిల్‌కు గురిచేస్తుంది. శివరంజని రహస్యం ఏమిటో ఆసక్తిని రేకెత్తిస్తుంది అన్నారు. హారర్ జోనర్‌లో కొత్త ప్రయోగమిదని, త్వరలోనే సెన్సార్ జరిపి ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర.

343

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles