దిల్‌రాజు ద్వారా...


Sat,July 6, 2019 12:57 AM

dil raju to release evariki cheppadu movie

రాకేష్ వర్రె, గార్గెయి ఎల్లప్రగడ జంటగా నటిస్తున్న చిత్రం ఎవరికీ చెప్పొద్దు. బసవ శంకర్ దర్శకత్వంలో రాకేష్ వర్రె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రాకేష్ వర్రె మాట్లాడుతూ హృద్యమైన ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి కథతో తెరకెక్కిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్ర కథ నచ్చి నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ జె. ఆనంద్, సంగీతం: శంకర్‌శర్మ, ఎడిటింగ్: బసవ శంకర్, తేజు యర్రంశెట్టి, సత్యజిత్ సుగ్గు, సౌండ్ డిజైన్: సింక్ సినిమా, పాటలు: వాసు వలబోజు.

1531

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles