భాగ్యనగరవీధుల్లో...

Mon,September 30, 2019 12:06 AM

శ్రీనివాసరెడ్డి, సత్య, షకలకశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు. ఈ చిత్రం ద్వారా కమెడియన్ శ్రీనివాసరెడ్డి దర్శకనిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. శ్రీనివాసరెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది. కథానుగుణంగా చక్కటి టైటిల్ కుదిరింది. అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అక్టోబర్‌లో సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తాం అన్నారు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రఘుబాబు, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భరణి కె ధరణ్, సంగీతం: సాకేత్ కొమండూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: పరమ్ సూర్యాన్షు, నిర్మాత, దర్శకత్వం: వై.శ్రీనివాసరెడ్డి.

523

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles