అతిలోకసుందరి శ్రీదేవి కథ పుస్తకావిష్కరణ


Thu,March 21, 2019 02:16 AM

Dil Raju Speech At Sri Devi Book Launch

పదహారేళ్ల వయసు సినిమాతో శ్రీదేవి కెరీర్ మొదలైంది. అంచలంచెలుగా ఎదిగి నంబర్‌వన్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలి లేడీ సూపర్‌స్టార్ అయ్యారు. అలాంటి శ్రీదేవి చరిత్రని భావితరాలకు తెలియజేస్తున్నందుకు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావును అభినందిస్తున్నాను అన్నారు దిల్‌రాజు. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన అతిలోకసుందరి శ్రీదేవి కథ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్‌లో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి దిల్‌రాజు విడుదల చేశారు. తొలి ప్రతిని నటుడు మాదాల రవి ఇరవై వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ అతిలోకసుందరి అనే టైటిల్ శ్రీదేవిగారికి మాత్రమే సూటవుతుంది. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశం మొత్తం ఆమె గురించి తెలుసు. దిల్‌రాజు చెప్పినట్టు భారతీయ సినిమాల్లో శ్రీదేవి తొలి లేడీ సూపర్‌స్టార్. అలాంటి నటి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, వైవీఎస్ చౌదరి, సీల్‌వెల్ కార్పొరేషన్ సుబ్బారావు, కె.అ చ్చిరెడ్డి, శివాజీరాజా, సురేష్ కొండేటి, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

917

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles