యాత్ర అందరికి నచ్చుతుంది!

Thu,February 7, 2019 12:53 AM

దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆయన చేసిన పాదయాత్రలోని ఎమోషన్స్‌ని తీసుకుని యాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు. వైఎస్ పాత్రలో మమ్ముట్టి లాంటి లెజెండరీ నటుడు నటించడంతో ట్రైలర్, టీజర్ ఎక్సైట్ చేశాయి. అందుకే ఈ చిత్రాన్ని నైజామ్, వైజాగ్‌లలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమాతో విజయ్ చిల్లాకు మరో హిట్ లభించాలి అన్నారు దిల్‌రాజు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం యాత్ర. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఆన్‌లైన్ బుకింగ్స్ బాగున్నాయి. బుకింగ్స్ బాగుంటేనే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఓపెనింగ్స్ బాగున్న సినిమాలే ఆడుతున్నాయి. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర గురించి పేపర్లలో చదివాం. టీవీల్లో చూశాం. పాదయాత్రతో ఆయన రాజకీయ జీవితమే మారిపోయింది. తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ తరువాత అంతటి ఇమేజ్‌ను తెచ్చుకున్నారాయన.

అలాంటి వ్యక్తి జీవితంపై వస్తున్న యాత్ర భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. విజయ్ చిల్లా మాట్లాడుతూ యాత్ర రాజకీయ చిత్రం కాదు. కానీ రాజకీయ నేపథ్యంలో సాగుతుంది. రాజశేఖర్‌రెడ్డి అభిమానులకే కాదు అన్ని వర్గాలకు నచ్చే సినిమా ఇది అన్నారు. దర్శకుడు మహి వి. రాఘవ్ మాట్లాడుతూ మనకు ఒకరు ఇష్టం వుండొచ్చు ఉండకపోవచ్చు అలా అని వారిని కించపరచడం మంచి పద్దతి కాదు. మనకు స్ఫూర్తి నిచ్చిన వారి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. ఇదే వారికి మనమిచ్చే గొప్ప నివాళి అన్నారు.

1544

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles