పవిత్ర ప్రేమికుడు


Sun,June 17, 2018 11:36 AM

Dil Raju Lover starring Raj Tarun and Riddhi Kumar first look

జీవిత పథంలో ప్రేమ ఒక అందమైన భావన. ప్రణయానుభూతుల్ని ఆస్వాదించకుండా యుక్తవయసును దాటొచ్చిన వారెవరూ ఉండరు. టీనేజ్‌లో ప్రతి ఒక్కరూ ఓ లవరే. అలాంటి మధురమైన ప్రేమజ్ఞాపకాలకు వెండితెర దృశ్యరూపమే మా లవర్ చిత్రం అంటున్నారు అనీశ్‌కృష్ణ. ఆయన దర్శకత్వంలో రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లవర్. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శిరీష్ సమర్పకుడు. గాయత్రి సురేష్ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై రెండోవారంలో విడుదల చేయనున్నారు. ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. పవిత్రమైన ప్రేమకు నిదర్శనంగా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: అంకిత్‌తివారి, రిషి రిచ్, ఆర్కో, తనీష్ బాగ్చి, సాయికార్తీక్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి.

2695

More News

VIRAL NEWS