1970 నేపథ్యంలో..


Sun,March 10, 2019 11:45 PM

diksoochi movie trailer launch

దిలీప్‌కుమార్ సల్వాది కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం దిక్సూచి. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. శైలజ సముద్రాల, నరసింహరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ దిలీప్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాడు. అతనికి అన్ని విభాగాల మీద పట్టు ఉంది. దర్శకుడి ప్రతిభ అంతా ట్రైలర్‌లో కనిపించింది అన్నారు. కొత్త జోనర్‌లో వస్తున్న చిత్రమిది. 1970 దశకం నేపథ్యంలో సెమీ పీరియాడిక్ చిత్రంగా రూపొందిస్తున్నాం. భక్తి, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అని దర్శకహీరో దిలీప్‌కుమార్ తెలిపారు. ఈ సినిమా కోసం దిలీప్ ఎంతగానో శ్రమించారని, టీమ్ సమిష్టి ఫలితంగా సినిమా అద్భుతంగా వచ్చిందని బిత్తిరి సత్తి పేర్కొన్నారు. ఛత్రపతి శేఖర్, సమ్మెటగాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్, సాహిత్యం: శ్రీరామ్ తపస్వీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దిలీప్‌కుమార్ సల్వాది.

702

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles