1970 నేపథ్యంలో..


Thu,March 21, 2019 12:16 AM

Diksoochi Movie Press Meet

దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ రూపొందించిన చిత్రం దిక్సూచి. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ మూడవ వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ 1970 నేపథ్యంలో సాగే సెమీ పిరియాడిక్ చిత్రమిది. థ్రిల్లింగ్, డివోషనల్ అంశాలతో పాటు అన్ని రకాల భావోద్వేగాలు ఈ సినిమాలో వున్నాయి. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని ఆనందింపజేస్తుంది. ఉగాది రోజు ఇదే సంస్థలో మరో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవలే మెల్‌బోర్న్‌లో రెండు వేల మంది పాల్గొనగా ట్రైలర్‌ని విడుదల చేశాం. అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ చిత్ర గీతాల హక్కుల్ని ఏ సంస్థకు ఇవ్వలేదు. దిక్సూచి యాప్ ద్వారా మేమే విడుదల చేస్తున్నాం. ఇదే యాప్ ద్వారా మా సంస్థ నుంచి వచ్చే చిత్రాల గీతాల్ని అందుబాటులోకి తీసుకొస్తాం. రైన్‌బో కార్పెట్ పేరుతో త్వరలో ప్రీరిలీజ్ వేడుకని నిర్వహించబోతున్నాం. కొంత మంది ప్రేక్షకుల్ని ఎంపిక చేసి వారికి విడుదలకు వారం ముందు చిత్రాన్ని ఉచితంగా చూపించబోతున్నాం అన్నారు. కథాబలమున్న చిత్రమిదని, ఇందులో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవని నిర్మాతలతో ఒకరైన నరసింహరాజు తెలిపారు.

931

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles