సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వలయం

Thu,October 3, 2019 12:10 AM

లక్ష్‌ హీరోగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రానికి ‘వలయం’ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. రమేష్‌ కుడుముల దర్శకుడు. చదలవాడ పద్మావతి నిర్మాత. దిగంగన సూర్యవన్షీ కథానాయిక. టైటిల్‌ లోగోను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఆసక్తికరమైన ఇతివృత్తంతో రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. కనిపించకుండా పోయిన ఓ అమ్మాయిని అన్వేషిస్తూ యువకుడు సాగించిన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. లక్ష్‌ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. 2020 ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, సినిమాటోగ్రఫీ: రామకృష్ణ.ఎస్‌. సమర్పణ:చదలవాడ బ్రదర్స్‌

338

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles