ఇండియన్-2 నుంచి తప్పుకుందా?


Thu,June 6, 2019 11:19 PM

Did Kajal Aggarwal walk out of Indian 2 Movie Here is what we know

ఇండియన్-2 సినిమా నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకుందా అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 2.ఓ తర్వాత కమల్‌హాసన్‌తో ఇండియన్-2 చిత్రానికి శ్రీకారం చుట్టారు దర్శకుడు శంకర్. ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నది. జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన తర్వాత కమల్‌హాసన్ రాజకీయాలతో బిజీగా ఉండటం, ఆర్థికపరమైన కారణాల వల్ల చిత్రీకరణకు పుల్‌స్టాప్ పడింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో అసంతృప్తి చెందిన కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఆమె అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. తాను నటిస్తున్న ఇతర సినిమాల షూటింగ్‌లకు ఇబ్బంది తలెత్తకూడదనే కాజల్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తున్నది.

1827

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles