రొమాంటిక్‌ థ్రిల్లర్‌

Fri,November 22, 2019 11:49 PM

ధనుష్‌, మేఘాఆకాష్‌ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘ఎనై నోకి పాయిమ్‌' తెలుగులో ‘తూటా’ పేరుతో ప్రేక్షకులముందుకురానుంది. రానా అతిథి పాత్రలో నటిస్తున్నారు. విజయభేరి పతాకంపై జి.తాతరెడ్డి, సత్యనారాయణరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథాంశమిది. ప్రేమజంటకు ఎదురైన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే అన్ని అంశాలుంటాయి’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌పరమహంస, జామన్‌ టి జాన్‌, ఎస్‌ఆర్‌ కాథిర్‌, సంగీతం: ధర్భుక శివ, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, రచన-దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌.

189

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles