క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్


Sat,July 20, 2019 11:10 PM

dhamki shooting competition

రజిత్, త్రిషాలాషా జంటగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ధమ్కీ. ఏనుగంటి దర్శకుడు. సుంకర బ్రదర్స్ పతాకంపై సత్యనారాయణ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇదొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కావల్సిన అంశాలన్నీ ఉంటాయి. తప్పకుండా అందరికి నచ్చుతుంది. బిత్తిరి సత్తిపై చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఏ విషయంలోనూ రాజీపడకుండా చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించిన పోరాట ఘట్టాలు చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడిని నమ్మి చేసిన చిత్రమిది. పోరాట ఘట్టాలకు పెద్దపీట వేసి రూపొందించాం. గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీమణి అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. చిత్ర విజయంపై నమ్మకంతో వున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.

226

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles