క్రైమ్ థ్రిల్లర్ ధమ్కీ


Sat,July 6, 2019 12:52 AM

dhamki is busy in post production work

రజిత్, త్రిషాలాషా జంటగా నటిస్తున్న చిత్రం ధమ్కీ. ఏనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యనారాయణ సుంకర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. దర్శకుడు మాట్లాడుతూ వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. తన లక్ష్యానికి అడ్డుగా నిలిచిన వారికి ఓ యువకుడు ఎలా ధమ్కీ ఇచ్చాడన్నది ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పతాక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం అని తెలిపారు. ప్రేమ, యాక్షన్, వినోదానికి వాణిజ్య హంగులను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఊహకందని మలుపులతో ఉత్కంఠను పంచుతుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు. శ్రవణ్, అజయ్, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, చిత్రం శ్రీను, వేణు, బిత్తిరి సత్తి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.బి. ఆనంద్, ఛాయాగ్రహణం: దీపక్ భగవంత్.

283

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles