ప్రేమికుడి ధమ్కి


Fri,September 6, 2019 11:10 PM

Dhamiki Movie Teaser Launch VV Vinayak

జంటగా నటిస్తున్న చిత్రం ధమి. ఏనుగంటి దర్శకుడు. సుంకర బ్రదర్స్ పతాకంపై సత్యనారాయణ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర టీజర్, బ్యానర్ లోగోను దర్శకుడు వి.వి.వినాయక్ గురువారం హైదరాబాద్‌లో విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుంకర బ్రదర్స్ మా కుటుంబానికి ఆత్మీయులు. సమిష్టిగా కథను నమ్మి ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ అంశాలతో టీజర్ బాగుంది. వారికి ఈ సినిమా పేరుతో పాటు డబ్బు తెచ్చిపెట్టాలి అని తెలిపారు. చిత్ర దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ శత్రువులకు తన తెలివితేటలతో ఓ ప్రేమికుడు ఎలా ధమ్కి ఇచ్చాడు? జీవన్మరణ పోరాటంలో అతడిని విజయం ఎలా వరించిందన్నది ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా నా రెండో చిత్రమిది. చాలా మంది నూతన నటీనటుల్ని పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందించాం అని అన్నారు. రియలిస్టిక్‌గా సాగే యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుందని రజత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్‌సుంకర, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

265

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles