దేవరకొండలో విజయ్ ప్రేమకథ

Sun,November 3, 2019 12:03 AM

విజయ్‌శంకర్, మౌర్యాని జంటగా నటిస్తున్న చిత్రం దేవరకొండలో విజయ్ ప్రేమకథ. వెంకటరమణ దర్శకుడు. వడ్డాన మన్మథరావు నిర్మాత. ఈ చిత్ర పోస్టర్‌ను ఇటీవల హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ టైటిల్ బాగుంది. మంచి కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉంది అన్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమ ప్రయాణంలో అందమైన అనుభూతులకు దృశ్యరూపంలా అలరిస్తుంది అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఐదు పాటలుంటాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలుంటాయి అన్నారు. నాగినీడు, సునీత, శిరిరాజ్, చలపతిరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.అమర్, సంగీతం: సదాచంద్ర, సాహిత్యం: చంద్రబోస్, వనమాలి, భాస్కరభట్ల, కాసర్లశ్యాం, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్ ఎస్.


310

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles