నోట్ల రద్దు సమస్యలతో


Wed,April 10, 2019 11:44 PM

Demonetisation Anthem from Cash Cash Movie Launched By Director Bobby

నోట్ల రద్దు సమయంలో సామాన్యులు ఎదుర్కొన్న వాస్తవిక పరిస్థితుల్ని ఈ పాట జ్ఞప్తికితెచ్చింది. ప్రజా సమస్యల నేపథ్యంలో సందేశాత్మకంగా సినిమాను తెరకెక్కించడం అభినందనీయం అని అన్నారు దర్శకుడు బాబీ(కె.ఎస్.రవీంద్ర). టీజాయ్, శక్తివేల్ కాల్కానా, నందు, చీనుమోహన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న తమిళ చిత్రం థట్రోమ్ థూక్రోమ్. ఈ సినిమాను మీడియా మార్షల్ సంస్థ క్యాష్ క్యాష్ పేరుతో తెలుగులో విడుదలచేస్తున్నది. అరుళ్‌కుమార్ దర్శకనిర్మాత. ఈ చిత్రంలోని డీమానిటైజేషన్ పాటను దర్శకుడు బాబీ బుధవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ డబ్బు సంపాదించాలని కలలుగనే ముగ్గురు యువకుల కథ ఇది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నాం.

నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం అని తెలిపారు. సంగీత దర్శకుడు డీజే వసంత్ మాట్లాడుతూ స్వతహాగా సంగీత దర్శకుడినైనా నేను ఈ సినిమాతో గేయరచయితగా మారాను. నోట్ల రద్దు సమయంలో నాకు ఎదురైన ఇక్కట్లను ఊహిస్తూ ఈ పాటను రాశాను. తమిళంలో శింబు ఆలపించిన ఈ గీతం తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: బాలమురళిబాలు, ఛాయాగ్రహణం: ఎన్ సతీష్ మురుగన్, నిర్మాత, దర్శకుడు: అరుళ్.

1370

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles