ధీవర ప్రేమకథ


Sat,January 5, 2019 11:25 PM

deevara movie first look realeased

నాగసాయి, విద్యా చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ధీవర. కె. విజయ్ జక్కి దర్శకుడు. హరనాథ్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు బాబీ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను ఆకట్టుకునే కథాంశమిది. పోస్టర్ బాగుంది. యూనిట్ అందరికి ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలి అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ టైటిల్‌కు తగినట్లుగానే వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ మిళితమై ఉంటుంది. ప్రేమ నుంచి ఎవరూ పారిపోలేరనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్నాం. రెండు జోనర్స్ కలయికగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం వినూత్నమైన అనుభూతిని పంచుతుంది అని చెప్పారు. యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. త్వరలో చిత్ర గీతాలతో పాటు ట్రైలర్‌ను విడుదలచేస్తాం. ఫిబ్రవరి నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అద్దంకి వెంకటేష్, సినిమాటోగ్రఫీ: సాగర్ గొళ్లా.

1349

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles