కేన్స్‌లో దీపిక మెరుపులు


Fri,May 19, 2017 12:00 AM

deepikapadukone
కేన్స్ వంటి ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాల్లో ఎర్రతివాచీపై నడయాడాలని ప్రతి కథానాయిక కోరుకుంటుంది. ఫ్రాన్స్‌లో మొదలైన 70వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తొలిరోజే ర్యాంప్‌పై సందడి చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది దీపికాపదుకునే. వయొలెట్ కలర్ మార్చెసా గౌనులో హొయలొలికించిన ఈ సొగసరి వేడుక తొలిరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపికా ర్యాంప్ నడక పూర్తయిన కొద్ది గంటలకు మల్లికా షెరావత్ సందడి చేశారు. ఈ ఏడాది కేన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్యరాయ్, సోనమ్‌కపూర్‌లు కూడా పాల్గొనబోతున్నారు. మే 28వరకు ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి.

694

More News

VIRAL NEWS