ధైర్యానికి చిరునామా!


Tue,March 26, 2019 01:18 AM

deepika padukone transforms into acid attack survivor in first look from meghna gulzar film chhapaak

పక్క ఫొటోలో ఓ అమ్మాయి కురూపిలా కనిపిస్తుంది. అందవిహీనంగా ఉన్నప్పటికి ఆ వదనంలో మాత్రం చిరునవ్వు తొణికిసలాడుతున్నది. ఆ మేకప్‌లో వుంది ఎవరో కాదు..కథానాయిక దీపికా పదుకునే. న్యూఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా ఛపాక్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. మేఘన గుల్జార్ దర్శకురాలు. సోమవారం నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో లక్ష్మి అగర్వాల్ పాత్రలో దీపికాపదుకునే నటిస్తున్నది. ఈ సందర్భంగా సినిమాలోని తన లుక్‌ను దీపికా పదుకునే అభిమానులతో పంచుకున్నది. యాసిడ్ దాడిలో ముఖం కాలిపోయి అందవిహీనంగా కనిపిస్తున్న ఆమె లుక్ అభిమానులకు షాకింగ్‌లా కనిపిస్తున్నది. ఈ పాత్ర నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది అని తెలిపింది దీపికా.

ఈ సినిమాలో దీపికా పదుకునే మాలతి అనే యువతిగా కనిపిస్తుందని దర్శకురాలు మేఘన గుల్జార్ చెప్పింది. ధైర్యానికి, నమ్మకానికి చిరునామా ఈ మాలతి అని తెలిపారామె. ఈ చిత్రాన్ని మేఘన గుల్జార్, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్‌తో కలిసి కేఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీపికా పదుకునే స్వయంగా నిర్మిస్తున్నారు. 2020 జనవరి 10న సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

789

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles