అభిమానులకు కానుక!


Sun,January 6, 2019 11:26 PM

deepika padukone launches her own website on her birthday

ఇటీవలే 33వ వసంతంలోకి అడుగుపెట్టింది బెంగళూరు సోయగం దీపికాపదుకునే. రణవీర్‌సింగ్‌తో వివాహానంతరం ఆమె జరుపుకున్న మొదటి పుట్టిన రోజు ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా స్వీయ విశేషాల సమాహారంగా ఓ కొత్త వెబ్‌సైట్‌ను ఆరంభించింది దీపికాపదుకునే. ఇందులో తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని పొందుపరిచింది. అభిమానులకు కానుకగా కొత్త వెబ్‌సైట్‌ను మొదలుపెట్టాను. నా సినిమాలకు సంబంధించిన తాజా సమాచారాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాను. పుట్టినరోజును పురస్కరించుకొని ఓ మంచి పనికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది అని చెప్పింది. ప్రస్తుతం దీపికాపదుకునే చపాక్ అనే పేరుతో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తారు. ఇదిలావుండగా శనివారం పుట్టినరోజు జరుపుకున్న దీపికాపదుకునేకు బాలీవుడ్ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

2002

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles